News Wednesday, August 2, 2017 - 11:44

News Items: 
Description: 
Arogyaraksha Health Insurance scheme for Rs. 1200 per annum ఆరోగ్య రక్ష.. ఏడాదికి రూ. 1200కే: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత రోజుల్లో చిన్నపాటి అనారోగ్యం తలెత్తినా హాస్పిటల్ బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ.. అన్ని వేళలా దాన్ని ఉపయోగించుకోవడం కుదరకపోవచ్చు. దీని పరిధిలోకి రాని వారు కూడా చాలా మందే ఉన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం ఆరోగ్య రక్ష బీమా పథకాన్ని ప్రారంభించింది. ఒక్కొక్కరు రూ. 1200 మాత్రమే చెల్లించి ఏడాదిపాటు రూ. 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను పొందే అవకాశం ఈ పథకం ద్వారా కలుగుతోంది. ప్రయివేట్ సంస్థలు అందిస్తోన్న హెల్త్ పాలసీలతో పోలిస్తే దీని ప్రీమియం చాలా తక్కువగా ఉండటంతోపాటు.. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఏ మాత్రం అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. సభ్యత్వం ప్రజాసాధికారిక సర్వేలో నమోదు చేసుకున్న ప్రజలు, తెల్లరేషన్ కార్డు వున్నా సరే సభ్యత్వం పొందొచ్చు. సభ్యత్వం పొందుటకు మీ దగ్గరలోని మీ సేవ కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ లో సభ్యత్వం తీసుకోవచ్చు. దీనికి ఆధార్ వివరాలు తప్పనిసరి. చివరి తేదీ డిసెంబర్ 2017. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ఉన్న 410 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు మరియు ఆసుపత్రిలో ఉన్నపుడు వైద్యంతో పాటు ఉచిత భోజనం అందిస్తారు. డిశ్చార్జ్ సమయంలో 11 రోజులకు సరిపడా మందులు కూడా ఇస్తారు. మరిన్ని విరవాలకు టోల్ ఫ్రీ నెంబరు 1800 599 1111 ను సంప్రదించగలరు.
Regional Description: 
ఆరోగ్య రక్ష.. ఏడాదికి రూ. 1200కే: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత రోజుల్లో చిన్నపాటి అనారోగ్యం తలెత్తినా హాస్పిటల్ బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ.. అన్ని వేళలా దాన్ని ఉపయోగించుకోవడం కుదరకపోవచ్చు. దీని పరిధిలోకి రాని వారు కూడా చాలా మందే ఉన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం ఆరోగ్య రక్ష బీమా పథకాన్ని ప్రారంభించింది. ఒక్కొక్కరు రూ. 1200 మాత్రమే చెల్లించి ఏడాదిపాటు రూ. 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను పొందే అవకాశం ఈ పథకం ద్వారా కలుగుతోంది. ప్రయివేట్ సంస్థలు అందిస్తోన్న హెల్త్ పాలసీలతో పోలిస్తే దీని ప్రీమియం చాలా తక్కువగా ఉండటంతోపాటు.. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఏ మాత్రం అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. సభ్యత్వం ప్రజాసాధికారిక సర్వేలో నమోదు చేసుకున్న ప్రజలు, తెల్లరేషన్ కార్డు వున్నా సరే సభ్యత్వం పొందొచ్చు. సభ్యత్వం పొందుటకు మీ దగ్గరలోని మీ సేవ కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ లో సభ్యత్వం తీసుకోవచ్చు. దీనికి ఆధార్ వివరాలు తప్పనిసరి. చివరి తేదీ డిసెంబర్ 2017. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ఉన్న 410 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు మరియు ఆసుపత్రిలో ఉన్నపుడు వైద్యంతో పాటు ఉచిత భోజనం అందిస్తారు. డిశ్చార్జ్ సమయంలో 11 రోజులకు సరిపడా మందులు కూడా ఇస్తారు. మరిన్ని విరవాలకు టోల్ ఫ్రీ నెంబరు 1800 599 1111 ను సంప్రదించగలరు.